ఈ సన్నివేశం ఎవరికైనా గుర్తుందా: రష్మిక

ABN , First Publish Date - 2020-12-18T22:25:27+05:30 IST

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కన్నడ భామ రష్మికా మందన్న కన్నడ, తమిళ సినిమాలు కూడా చేస్తోంది

ఈ సన్నివేశం ఎవరికైనా గుర్తుందా: రష్మిక

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న కన్నడ భామ రష్మికా మందన్న కన్నడ, తమిళ సినిమాలు కూడా చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఫన్నీ వీడియోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రష్మిక దేవత గెటప్‌లో ఉండి తుంబురను తిప్పుతోంది. 


ఆ వీడియోను పోస్ట్ చేసి `ఈ వీడియో ఎవరికైనా గుర్తుందా?` అని ప్రశ్నించింది. అలాగే  `నేను ఏ సాంప్రదాయాన్నీ, దేవతలను అగౌరవపరచడం లేదు. ఈ వీడియోను దయచేసి ఆ కోణంలో చూడకండి. ఇది ఓ సినిమాలోని ఫన్నీ సీన్` అని పేర్కొంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Updated Date - 2020-12-18T22:25:27+05:30 IST