తండ్రి గురించి రష్మిక ఎమోషనల్ మెసేజ్!

ABN , First Publish Date - 2020-06-16T22:37:23+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

తండ్రి గురించి రష్మిక ఎమోషనల్ మెసేజ్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక ట్విటర్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వస్తోంది. తాజాగా తన తండ్రి గురించి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. 


`నాన్న గురించి ఏం చెప్పాలి. నేను పుట్టడానికి రెండ్రోజుల ముందు.. పొడవైన జుట్టు, పెద్ద కళ్లు ఉన్న ఓ చిన్నారి తన పొట్ట మీద డ్యాన్స్ చేస్తున్నట్టు మా నాన్నకి కల వచ్చిందట. ఆ కల గురించి మా నాన్న నాకు తరచుగా చెప్పేవారు. నా చిన్నతనంలో మా నాన్న ఎప్పుడూ బిజినెస్ పనులతో బిజీగా ఉండేవారు. ఆ తర్వాత నేను హాస్టల్‌కు వెళ్లిపోయాను. చదువుతో బిజీ అయిపోయాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేశాను. నేను ఇప్పుడు ఆయన వ్యాపార భాగస్వామిని. నా ఈ ప్రయాణంలో ఆయన మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. మేం పెద్దగా మాట్లాడుకోం. అయితే ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉందని అర్థం చేసుకుంటాం` అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రష్మిక షేర్ చేసింది. 
Updated Date - 2020-06-16T22:37:23+05:30 IST