చిన్నప్పుడే కవర్ పేజ్ ఎక్కిన రష్మిక.. ఫొటో వైరల్

ABN , First Publish Date - 2020-06-05T04:36:02+05:30 IST

రష్మిక చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక తన చిన్నప్పుడే ఓ మ్యాగ్‌జైన్ కవర్

చిన్నప్పుడే కవర్ పేజ్ ఎక్కిన రష్మిక.. ఫొటో వైరల్

రష్మిక చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక తన చిన్నప్పుడే ఓ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపైకి ఎక్కడం ఇక్కడ విశేషం. ఈ ఫొటోని స్వయంగా రష్మికానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు కవర్ పేజీపైన హీరోయిన్ కనిపించాలంటే చాలా తతంగం ఉంది. ఆ హీరోయిన్ ఎక్స్‌పోజింగ్‌లో దిట్ట అయినా అయ్యిండాలి లేదంటే టాప్ హీరోయిన్ అయినా అయ్యిండాలి. అలాంటిది చిన్నప్పుడే రష్మిక మ్యాగ్‌జైన్ కవర్ పేజ్‌పై వచ్చిందంటే.. నిజంగానే ఆమె సామాన్యురాలు కాదు. 


సందర్భాన్ని బట్టి క్షణాల్లో నిర్ణయం మార్చుకోవడం రష్మికకు ఉన్న టాలెంట్స్‌లో ఒకటి. అందుకు ఉదాహరణ పెళ్లిపీటల వరకు వెళ్లిన తన పెళ్లిని తనే కాదనుకోవడం. ఆ తర్వాత ఎక్కడో కన్నడలో స్టార్ హీరోయిన్‌గా ఉండాల్సిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకోవడం. అందులోనూ స్టార్ హీరోల చిత్రాలలో వరుసగా అవకాశాలు వస్తుండటం చూస్తుంటే.. నిజంగానే రష్మికకు అదృష్టం మాములుగా లేదని చెప్పాలి. ఇంతకీ ఈ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపై ఉన్న రష్మిక ఏజ్ ఎంతో తెలుసా? 5 సంవత్సరాలు. గోకులం అనే మ్యాగ్‌జైన్‌లో 2001లో వచ్చిన కవర్ పేజీ ఇది అని తెలుపుతూ.. ‘‘ఈ ఫొటోని మా అమ్మ దాచుకుంది, ఇదొక్కటే కాదు ఇప్పటికీ ఏ మ్యాగ్‌జైన్ కవర్ పేజీపై నా ఫొటో వచ్చినా దానిని అమ్మ ఇలాగే దాచుకుంటుంది..’’ అని రష్మిక తెలిపింది. Updated Date - 2020-06-05T04:36:02+05:30 IST