మహేష్‌కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన రష్మిక

ABN , First Publish Date - 2020-06-29T23:12:04+05:30 IST

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబుని చూసి రష్మిక ఎలా ఇంప్రెస్ అయ్యిందో తెలిసిందే. అయితే అది సినిమాలోనే అనుకున్నారు. కానీ ఆమె నిజ జీవితంలో కూడా బాగా

మహేష్‌కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన రష్మిక

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబుని చూసి రష్మిక ఎలా ‘ఇంప్రెస్’ అయ్యిందో తెలిసిందే. అయితే అది సినిమాలోనే అనుకున్నారు. కానీ ఆమె నిజ జీవితంలో కూడా బాగా ఇంప్రెస్ అయినట్లు ఉంది. ‘యు ఆర్ సో క్యూట్.. యు ఆర్ సో హ్యాండ్సమ్!’ అంటూ ఆ సినిమాలో పాటేసుకున్న రష్మిక.. మహేష్ అందానికి నిజంగానే ఫిదా అయ్యిందా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కూడా ఆమె మహేష్ జపమే చేస్తుంది. అందుకు ఉదాహరణ ఆమె మహేష్‌కు పంపిన గిఫ్టే. అవును సూపర్ స్టార్ మహేష్ బాబుకు రష్మిక అదిరిపోయే గిఫ్ట్ పంపింది. ఏంటది అనుకుంటున్నారా?


ప్రస్తుత లాక్‌డౌన్‌లో కూర్గ్‌లోని హిల్ స్టేషన్‌లో తల్లిదండ్రులతో ఉన్న రష్మిక అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లుగా ఉంది. అక్కడ పండే ఫ్రూట్స్‌ని, అలాగే స్వయంగా తను తయారు చేసిన ఆవకాయను అందంగా ప్యాక్ చేసి మహేష్‌కు గిఫ్ట్‌గా పంపింది. ఈ విషయం మహేష్ బాబు భార్య నమ్రతా తన ఇన్‌స్టాగ్రమ్‌లో తెలిపారు. రష్మిక పంపిన గిఫ్ట్‌ను పోస్ట్ చేసిన నమ్రత.. ‘‘ఈ కరోనా లాక్‌డౌన్‌లో మాకు అందిన ఫస్ట్ గిఫ్ట్ ఇదే. కూర్గ్‌లోని అద్భుతమైన వాతావరణం నుంచి.. మంచి ఐటమ్స్ పంపిన రష్మికకు కృతజ్ఞతలు’’ అంటూ నమ్రత తెలిపింది.Updated Date - 2020-06-29T23:12:04+05:30 IST