తిరుపతిలో రష్మిక వర్కవుట్!

ABN , First Publish Date - 2020-10-27T22:31:26+05:30 IST

కన్నడ భామ రష్మిక ప్రస్తుతం తెలుగులో చాలా బిజీగా ఉంది

తిరుపతిలో రష్మిక వర్కవుట్!

కన్నడ భామ రష్మిక ప్రస్తుతం తెలుగులో చాలా బిజీగా ఉంది. అటు స్టార్ హీరోల సినిమాల్లోనూ, ఇటు యువ హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇప్పటికే సుకుమార్-అల్లు అర్జున్ `పుష్ప` సినిమాకు ఓకే చెప్పిన రష్మిక.. తాజాగా యువ హీరో శర్వానంద్ `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమాను ప్రారంభించింది. 


కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దసరా రోజున తిరుపతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా వ్యాయామం అనంతరం తీసుకున్న ఫొటోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `తిరుపతిలో వర్కవుట్. నేను చెప్పేదేమిటంటే.. మినహాయింపులు లేవు` అంటూ రష్మిక పేర్కొంది. Updated Date - 2020-10-27T22:31:26+05:30 IST