వంటింట్లో రష్మిక!

ABN , First Publish Date - 2020-09-24T00:31:25+05:30 IST

ఈ ఏడాది ఆరంభంలోనే `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` రూపంలో రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది కన్నడ బ్యూటీ రష్మికా మందన్న.

వంటింట్లో రష్మిక!

ఈ ఏడాది ఆరంభంలోనే `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` రూపంలో రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది కన్నడ బ్యూటీ రష్మికా మందన్న. ఆ తర్వాత లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. వంటింట్లోకి ప్రవేశించి ప్రయోగాలు కూడా చేస్తోంది. 


తాజాగా పాన్ కేక్ తయారీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం రుచికరంగా ఉండదని అంటుంటారని, అయితే తను చేసిన పాన్ కేక్ రుచికరంగా ఉండడంతో పాటు హెల్త్‌కు కూడా చాలా మంచిదని పేర్కొంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `పుష్ప` సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. 


 Updated Date - 2020-09-24T00:31:25+05:30 IST