రష్మిక ఎమోషనల్ ట్వీట్!

ABN , First Publish Date - 2020-10-27T18:29:30+05:30 IST

తెలుగు, కన్నడ భాషల చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మికా మందన్నా త్వరలో తమిళ తెరపై కూడా మెరవనుంది.

రష్మిక ఎమోషనల్ ట్వీట్!

తెలుగు, కన్నడ భాషల చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మికా మందన్నా త్వరలో తమిళ తెరపై కూడా మెరవనుంది. కార్తీ హీరోగా బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కించిన `సుల్తాన్` సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఇదే ఆమెకు తొలి తమిళ సినిమా. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ తాజగా విడుదలైంది. 


తమిళంలో తన తొలి సినిమా గురించి రష్మిక ఎమోషనల్‌గా స్పందించింది. `చిన్నప్పటి నుంచి నాన్న, నేను ఎక్కువగా తమిళ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ సినిమాలో నేను నటించడం నమ్మలేనట్టుగా ఉంది. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. నేను నిజంగా కృతజ్ఞురాలిన`ని రష్మిక ట్వీట్ చేసింది. 
Updated Date - 2020-10-27T18:29:30+05:30 IST