సమంత ఛాలెంజ్‌ను పూర్తి చేసిన రష్మిక!

ABN , First Publish Date - 2020-07-16T20:03:47+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు భారీగా పాల్గొంటున్నారు.

సమంత ఛాలెంజ్‌ను పూర్తి చేసిన రష్మిక!

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు భారీగా పాల్గొంటున్నారు.  మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సమంత నుంచి ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ హీరోయిన్ రష్మిక తాజాగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పొందుపరిచింది. 


ఈ ఛాలెంజ్‌కు తనను నామినేట్ చేసిన సమంతకు రష్మిక కృతజ్ఞతలు తెలిపింది. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, తన అభిమానులు, యువతీయువకులు ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరింది. తన సహచర హీరోయిన్లు రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసింది. 




Updated Date - 2020-07-16T20:03:47+05:30 IST