రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ

ABN , First Publish Date - 2020-12-24T06:20:48+05:30 IST

చిన్న సినిమాతో పరిచయమై, వరుస విజయాలతో తెలుగులో టాప్‌ హీరోయున్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు...

రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ

చిన్న సినిమాతో పరిచయమై, వరుస విజయాలతో తెలుగులో టాప్‌ హీరోయున్‌గా ఎదిగిన కన్నడ భామ రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్దార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్నభారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  ‘మిషన్‌ మజ్ను’ లో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఆమె వెల్లడిస్తూ ‘మంచి సినిమాలో నేనూ భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్న నాకు భాషాపరమైన పట్టింపులు లేవు’ అన్నారు. 


1970ల  దశకంలో పాకిస్తాన్‌లో ఇండియన్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ జరిపే ఓ సీక్రెట్‌ మిషన్‌ ఆదారంగా ఈ సినిమా ఉంటుంది.  ఇందులో  సిద్దార్థ్‌ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తున్నారు. యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ఎన్నో అవార్డులు పొందిన  షంతాను బాగ్చీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల్లో ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని అమర్‌ బటాలా, గరిమా మెహతా సంయుక్తంగా నిర్మించనున్నారు.

Updated Date - 2020-12-24T06:20:48+05:30 IST