డేటింగ్‌ చేయాలనివుంది రాశీ ఖన్నా

ABN , First Publish Date - 2020-12-01T06:42:27+05:30 IST

రాశీ ఖన్నా చాలా గడసరి. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో బాగా తెలిసిన అందాల బొమ్మ. ఎంత తక్కువ మాట్లాడుతుందో అంత వేగంగా...

డేటింగ్‌ చేయాలనివుంది రాశీ ఖన్నా

రాశీ ఖన్నా చాలా గడసరి. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో బాగా తెలిసిన అందాల బొమ్మ. ఎంత తక్కువ మాట్లాడుతుందో అంత వేగంగా ఆలోచిస్తుంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ప్రేమ సక్సెస్‌ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుంది. ప్రేమలో వైఫల్యాలే ఎక్కువ. అలాంటి చేదు అనుభవం తనకు కూడా ఉందని ఆమె గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. స్కూల్‌ డేస్‌లో తనకన్నా సీనియర్‌తో రాశీ ప్రేమలో పడ్డారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ విఫలమైంది. మరి, ‘ఇప్పుడు ప్రేమలో ఉన్నారా?’ అని రాశీఖన్నాను అడిగితే.. ‘‘నేను ఇప్పుడు సింగిల్‌గా ఉన్నా. ప్రస్తుతానికి నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలనివుంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా’’ అని అన్నారు. 


Updated Date - 2020-12-01T06:42:27+05:30 IST

Read more