రాశీఖన్నా వర్కవుట్ వీడియో!

ABN , First Publish Date - 2020-10-21T01:04:05+05:30 IST

`ఊహలు గుసగుసలాడే` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది

రాశీఖన్నా వర్కవుట్ వీడియో!

`ఊహలు గుసగుసలాడే` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎన్టీయార్ వంటి స్టార్ హీరోలతో పాటు యువ కథానాయకుల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగానే ఉంది. కరోనా సమయంలో రాశి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది.


కఠినమైన వర్కవుట్లు చేసి సన్నజాజిలా తయారైంది. తన వర్కవుట్ వీడియోలను, హాట్ హాట్ ఫొటోలను రాశి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా రాశి తన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `మన ఫోకస్ దేనిపై ఉంటే.. ఎనర్జీ అక్కడికే ప్రవహిస్తుంద`ని కామెంట్ చేసింది. Updated Date - 2020-10-21T01:04:05+05:30 IST