రాశి కూడా ఆ బాటలోనే..!

ABN , First Publish Date - 2020-12-26T20:48:10+05:30 IST

సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంపై కూడా దృష్టి సారిస్తున్నారు.

రాశి కూడా ఆ బాటలోనే..!

సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంపై కూడా దృష్టి సారిస్తున్నారు. దక్షిణాదికి చెందిన పలువురు హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, సాయిపల్లవి, అంజలి తదితర హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల్లో నటించారు. తాజాగా ఆ జాబితాలోకి రాశీ ఖన్నా కూడా చేరింది. 


బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షాహిద్ కపూర్‌తో కలిసి రాశి ఓ వెబ్ సిరీస్‌లో సందడి చేయబోతోంది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి కూడా ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తున్నాడు. `ఫ్యామిలీ మేన్` సిరీస్‌ను రూపొందించిన రాజ్-డి.కె. ఈ వెబ్ సిరీస్‌ను కూడా తెరకెక్కించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోందట. 

Updated Date - 2020-12-26T20:48:10+05:30 IST