నేను దీపికకి అసిస్టెంట్‌ని: రణ్‌వీర్

ABN , First Publish Date - 2020-05-26T19:59:11+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు

నేను దీపికకి అసిస్టెంట్‌ని: రణ్‌వీర్

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. తమకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారు. అంతేకాదు తరచుగా లైవ్‌లోకి వస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. 


తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన రణ్‌వీర్.. దీపిక వంట గురించి మాట్లాడాడు. `నేను కాలేజీ రోజుల్లో బటర్ చికెన్ బాగా చేసేవాణ్ని. కాకపోతే తయారీ సమయంలో రెడీమేడ్ ప్యాకెట్స్‌ ఎక్కువగా ఉపయోగించేవాణ్ని. నా కంటే దీపిక చాలా బాగా వంట చేస్తుంది. ఆమెకు వంట చేయడం ఇష్టం. అందుకే వంట గది బాధ్యతలను ఆమెకు అప్పగించా. నేను ఆమెకు గొప్ప అసిస్టెంట్‌ను. వంట గదిలో ఆమెకు సహాయం చేస్తుంటాన`ని రణ్‌వీర్ తెలిపాడు. 

Updated Date - 2020-05-26T19:59:11+05:30 IST