కీర్తిసురేష్‌తో ‘ఏమిటో ఇది’ అంటోన్న నితిన్‌

ABN , First Publish Date - 2020-11-06T05:18:14+05:30 IST

'తొలిప్రేమ',' మిస్టర్‌ మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. సితార

కీర్తిసురేష్‌తో ‘ఏమిటో ఇది’ అంటోన్న నితిన్‌

'తొలిప్రేమ',' మిస్టర్‌ మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం 'రంగ్‌దే'. పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నితిన్‌, కీర్తిసురేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. 'ఏమిటో ఇది' అనే లిరిక్స్‌తో ఉన్న ఈ లవ్‌ సాంగ్‌ వినసొంపుగా ఉంది. ఈ పాటను శ్రీమణి రచింపగా.. కపిల్‌ కపిలన్‌, హరిప్రియ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో టాప్‌ 1లో ట్రెండ్‌ అవుతోంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.Updated Date - 2020-11-06T05:18:14+05:30 IST