రంగ్‌ దే... మళ్లీ సెట్స్‌పైకి!

ABN , First Publish Date - 2020-09-24T06:56:06+05:30 IST

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. కొంత విరామం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో...

రంగ్‌ దే... మళ్లీ సెట్స్‌పైకి!

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. కొంత విరామం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించారు. తాజా షెడ్యూల్‌లో నితిన్‌, బ్రహ్మాజీ సహా ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని చిత్రబృందం తెలియజేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేమతో కూడిన కుటుంబకథా చిత్రమిది. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. కొన్ని రోజుల్లో సినిమా పూర్తవుతుంది. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. వీకే నరేశ్‌, వినీత్‌, రోహిణి, కౌసల్య, ‘వెన్నెల’ కిశోర్‌, ‘సత్యం’ రాజేశ్‌, అభినవ్‌ గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సమర్పణ: పీడీవీ ప్రసాద్‌.

Updated Date - 2020-09-24T06:56:06+05:30 IST