సంజయ్ దత్‌ను కలిసిన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్

ABN , First Publish Date - 2020-08-14T02:03:26+05:30 IST

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ వ్యాధికి చికిత్స....

సంజయ్ దత్‌ను కలిసిన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్

ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ బుధవారం సంజయ్‌ను కలిసి పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్ దర్శనమిచ్చాయి. రణ్‌బీర్, ఆలియాలు సంజయ్ దత్ ఇంటి నుంచి బయటకు వస్తున్న దృశ్యాన్ని ఆ ఫోటోల్లో గమనించవచ్చు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. తన అనారోగ్యం దృష్ట్యా సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్వరలో కోలుకుని మళ్లీ కెమెరా ముందుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-14T02:03:26+05:30 IST