గోవాలో ఎంజాయ్ చేసిన ప్రేమజంట!

ABN , First Publish Date - 2020-12-15T17:43:57+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం కొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది

గోవాలో ఎంజాయ్ చేసిన ప్రేమజంట!

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం కొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది. వీరి ప్రేమ గురించి, పెళ్లి గురించి జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. రణ్‌బీర్ బిల్డింగ్‌లోని ఓ ఖరీదైన ఫ్లాట్‌లోకి ఆలియా మకాం మార్చిందని ఇటీవల మరో వార్త వైరల్ అయింది. 


తాజాగా రణ్‌బీర్, ఆలియా కలిసి గోవాకి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ముంబై విమానాశ్రయంలో వీరిద్దరూ కెమెరాకు చిక్కారు. లాక్‌డౌన్ అనంతరం వరుస షూటింగ్‌లతో బిజీ అయిన ఆలియా కాస్త బ్రేక్ దొరక్కగానే ప్రియుడితో కలిసి గోవాకి చెక్కేసింది. అక్కడ వీరిద్దరూ ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా చూశారు. అనంతరం వీరిద్దరూ తిరిగి ముంబై చేరుకున్నారు. 

Updated Date - 2020-12-15T17:43:57+05:30 IST

Read more