అఫీషియల్: పవన్‌తో రానా!

ABN , First Publish Date - 2020-12-21T16:16:18+05:30 IST

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు

అఫీషియల్: పవన్‌తో రానా!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్ సాబ్`లో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాను కూడా త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా మరో సినిమా ప్రకటన బయటకు వచ్చింది. 


మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. Updated Date - 2020-12-21T16:16:18+05:30 IST