రెడీ అంటున్న రానా!

ABN , First Publish Date - 2020-08-08T15:40:19+05:30 IST

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ దగ్గుబాటి రానా మరికొద్దిసేపట్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

రెడీ అంటున్న రానా!

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ దగ్గుబాటి రానా మరికొద్దిసేపట్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌తో  కలిసి ఈ రోజు (శనివారం) పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఈ సందర్భంగా రానా `రెడీ` అంటూ ట్వీట్ చేశాడు. తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌తో కలిసి సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడు. 


దీంతో రానా స్నేహితులు, బంధువులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అతి తక్కువ మంది అతిథుల సమక్షంలోనే రానా వివాహం జరుగనుంది. ఈ శుభకార్యానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకాబోతున్నారట.
Updated Date - 2020-08-08T15:40:19+05:30 IST

Read more