`నో పెళ్లి`.. టంగ్ స్లిప్ అయ్యాను: రానా

ABN , First Publish Date - 2020-05-25T18:13:53+05:30 IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `సోలో బ్రతుకే సో బెటరు`

`నో పెళ్లి`.. టంగ్ స్లిప్ అయ్యాను: రానా

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `సోలో బ్రతుకే సో బెటరు`. నభా నటేష్ హీరోయిన్. తాజాగా ఈ సినిమాలోని `నో పెళ్లి, దాని తల్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి` అంటూ సంగీత దర్శకుడు తమన్ స్వరపరిచిన పాటను యంగ్ హీరో నితిన్ విడుదల చేశాడు. 


ఈ పాట వీడియోలో సాయితేజ్‌తోపాటు వరుణ్ తేజ్, దగ్గుబాటు రానా కూడా కనిపించారు. పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ పాట లింక్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన రానా.. `నా యూత్‌లో కొంచెం టంగ్ స్లిప్ అయ్యాను` అంటూ కామెంట్ చేశాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌తో రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. 
Updated Date - 2020-05-25T18:13:53+05:30 IST

Read more