పాత్ర కోసం రానా రిస్క్‌

ABN , First Publish Date - 2020-02-26T00:41:13+05:30 IST

రానా ద‌గ్గుబాటి... న‌టుడిగా ద‌శాబ్దం అనుభ‌వం సంపాదించున్నాడు. హీరోగా, విల‌న్‌గా ఇలా వైవిధ్య‌మైన పాత్ర‌లతో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నాడు.

పాత్ర కోసం రానా రిస్క్‌

రానా ద‌గ్గుబాటి... న‌టుడిగా ద‌శాబ్దం అనుభ‌వం సంపాదించున్నాడు. హీరోగా, విల‌న్‌గా ఇలా  వైవిధ్య‌మైన పాత్ర‌లతో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు రానా టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `అర‌ణ్య‌`. ఈ సినిమాలో రానా స‌రికొత్త పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఈ పాత్ర కోసం 30 కిలోల బ‌రువు త‌గ్గారు. ఓ పాత్ర కోసం అంత బ‌రువు త‌గ్గి రిస్క్ చేసిన రానా ప్రేక్ష‌కుల‌ను ఏప్రిల్ 2న మెప్పించ‌బోతున్నారు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో అరణ్య‌, త‌మిళంలో కాండ‌న్‌, హిందీలో హ‌థీ మేరీ సాథీ పేర్ల‌తో సినిమాను ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ విడుద‌ల చేస్తుంది. 

Updated Date - 2020-02-26T00:41:13+05:30 IST