పెళ్లి సందడి మొదలైంది

ABN , First Publish Date - 2020-08-07T05:11:40+05:30 IST

రానా పెళ్లి సందడి మొదలైంది. ఆషాఢమాసం ప్రారంభానికి ముందే దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబాలు లగ్న పత్రికలు ఇచ్చి పుచ్చుకున్నాయి. ఇప్పుడు శ్రావణమాసం మొదలు కావడంతో...

పెళ్లి సందడి మొదలైంది

రానా పెళ్లి సందడి మొదలైంది. ఆషాఢమాసం ప్రారంభానికి ముందే దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబాలు లగ్న పత్రికలు ఇచ్చి పుచ్చుకున్నాయి. ఇప్పుడు శ్రావణమాసం మొదలు కావడంతో సరికొత్తగా పెళ్లి పనులు ప్రారంభించారు. రానాకు రాబోయే శ్రీమతి మిహీకా ఇంట బుధవారం పసుపు-కుంకుమ వేడుక జరిగింది. దీనికి అతికొద్ది మంది బంధుమిత్రులు, రానా సహా అతని కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారు. ఈ వేడుకలో పసుపు వర్ణపు దుస్తులు, గవ్వలతో చేసిన ఆభరణాలతో మిహీకా బజాజ్‌ మెరిసిపోగా, గతంలో రోకా వేడుకలో తెల్లపంచె, షర్టుతో సందడి చేసిన రానా, మరోసారి అదే లుక్‌ రిపీట్‌ చేశారు. గురువారం సాయంత్రం మెహందీ ఫంక్షన్‌ జరిగినట్టు సమాచారం. ఈ నెల 8న వివాహ బంధంతో రానా, మిహీకా ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహాన్ని వైభవంగా జరిపించాలని అనుకున్నప్పటికీ... కరోనా పరిస్థితుల దృష్ట్యా రామానాయుడు స్టూడియోలో వధూవరుల కుటుంబ సభ్యులు, 30 మందిలోపు ఆహ్వానితుల సమక్షంలో పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. వివాహ సమయంలో భౌతిక దూరం పాటించడంతో పాటు వివాహానికి వచ్చే వాళ్లందరికీ కరోనా టెస్టులు చేయించాలని అనుకుంటున్నారట.

Updated Date - 2020-08-07T05:11:40+05:30 IST