మరో టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు రానా

ABN , First Publish Date - 2020-05-04T15:17:57+05:30 IST

ద‌గ్గుబాటి హీరో ఈ క్వారంటైన్ స‌మ‌యాన్ని వేస్ట్ చేయ‌లేదు. ఓ కొత్త టీవీ షోతో ప్రేక్ష‌కుల ముందుకు ఆర‌బోతున్నారు.

మరో టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు రానా

‘ఆర‌ణ్య’ సినిమా విడుద‌ల కోసం రానా ద‌గ్గుబాటి ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో ఆగిపోయింది. మ‌రో ప‌క్క షూటింగ్ జ‌రుపుకుంటోన్న ‘విరాట‌ప‌ర్వం’ కూడా ఆగింది. ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఇంటికే ప‌రిమితం అయ్యారు రానా. ఈ ద‌గ్గుబాటి హీరో ఈ క్వారంటైన్ స‌మ‌యాన్ని వేస్ట్ చేయ‌లేదు. ఓ కొత్త టీవీ షోతో ప్రేక్ష‌కుల ముందుకు ఆర‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న తండ్రి సురేష్‌బాబు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇప్ప‌టికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. త్వ‌ర‌లోనే టెలికాస్ట్ కానుంది. రానా ఎలాంటి షో చేశారనే స‌స్పెన్స్‌కు తెర‌దిగాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది వ‌ర‌కు రానా నెంబ‌ర్ వ‌న్ యారీ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. 

Updated Date - 2020-05-04T15:17:57+05:30 IST