చాలా కాలం తర్వాత..: రానా

ABN , First Publish Date - 2020-11-13T19:31:31+05:30 IST

కరోనా కారణంగా సినీ ప్రముఖులందరూ దాదాపు ఏడు నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు.

చాలా కాలం తర్వాత..: రానా

కరోనా కారణంగా సినీ ప్రముఖులందరూ దాదాపు ఏడు నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అయినా కరోనా కేసులు తగ్గకపోవడంతో చాలా మంది షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కొందరు షూటింగ్‌లకు హాజరవుతున్నారు. 


లాక్‌డౌన్ కంటే ముందే అనారోగ్యం కారణంగా షూటింగ్‌లకు దూరమైన రానా చాలా రోజుల తర్వాత ఈ రోజు (శుక్రవారం) షూటింగ్‌కు హాజరయ్యాడు. షూటింగ్‌కు వెళుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఔట్ డోర్ షూటింగ్‌కు వెళ్తున్నట్టు పేర్కొన్నాడు. వేణు ఉడుగుల రూపొందిస్తున్న `విరాటపర్వం` సినిమాలో రానా ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. 



Updated Date - 2020-11-13T19:31:31+05:30 IST