రానాకు కాబోయే భార్య వివరాలివే..

ABN , First Publish Date - 2020-05-13T04:54:59+05:30 IST

టాలీవుడ్‌లోని మరో ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. 35 సంవత్సరాల దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని ప్రపంచానికి

రానాకు కాబోయే భార్య వివరాలివే..

టాలీవుడ్‌లోని మరో ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. 35 సంవత్సరాల దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. తన ట్విట్టర్‌లో మిహిక బజాజ్ అనే యువతి ఫొటోని పోస్ట్ చేస్తూ.. ‘‘ఆమె అంగీకారం తెలిపింది..’’ అని ఒక లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌ను బాహాటంగా పెట్టడంతో అతని ప్రేమకు పెద్దవాళ్ల నుంచి అంగీకారం వచ్చేసినట్లుగానే తెలుస్తుంది. మరి ఈ విషయమై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.


ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బంటీ బజాజ్ కుమార్తె మిహిక బజాజ్. వీరు హైదరాబాద్ నివాసులే. ప్రస్తుతం ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థను నడుపుతోంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే ఇష్టపడే మిహిక.. ముంబయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా అందుకుంది. లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్‌లో ఎంఏ చేసింది. మరి రానాకు మిహిక ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయమైంది? వారి మధ్య ప్రణయం ఎలా మొదలైంది? అనే విషయాలను వారి నోటనే త్వరలో తెలిసే అవకాశముంది. 

Updated Date - 2020-05-13T04:54:59+05:30 IST