కాబోయే భార్య ఫొటో పోస్ట్ చేసిన రానా

ABN , First Publish Date - 2020-05-12T23:06:55+05:30 IST

రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘ఆమె ఒప్పుకుంది’ అని

కాబోయే భార్య ఫొటో పోస్ట్ చేసిన రానా

రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘ఆమె ఒప్పుకుంది’ అని తెలిపారు. ఇంతకీ రానా చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? ‘మిహిక బజాజ్’. ఇప్పటికే రానా ప్రేమ విషయంలో ఎన్నో గాసిప్స్ వినిపించాయి. ఎందరో హీరోయిన్ల పేరు కూడా రానా పెళ్లి చేసుకునే వారి లిస్ట్‌లో వినిపించింది. ఫైనల్‌గా రానా తన మనసులో ఉన్న అమ్మాయి ఫొటో షేర్ చేసి వస్తున్న గాసిప్స్ అన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.


మరి రానాకి కాబోయే మిహిక బజాజ్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే వారిద్దరి పెళ్లి ఎప్పుడు? ఎలా ఉండబోతుందనే విషయాలలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్యాగ్ నుంచి రానా విముక్తి కాబోతున్నాడనేది మాత్రం అర్థమవుతుంది. 

Updated Date - 2020-05-12T23:06:55+05:30 IST