సంక్రాంతికి రానా 'అరణ్య'

ABN , First Publish Date - 2020-10-21T18:51:14+05:30 IST

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో న‌టించినచిత్రం `అర‌ణ్య‌`. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

సంక్రాంతికి రానా 'అరణ్య'

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో న‌టించినచిత్రం `అర‌ణ్య‌`. ఏప్రిల్ 2న ఈ సినిమాను ను ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ తెలుగు స‌హా హిందీ భాష‌లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కోవిడ్‌ ప్రభావంతో సినిమా విడుదల ఆగింది. దాదాపు ఆరేడు నెలలు వరకు థియేటర్స్‌ మూత పడ్డాయి. ఈ అక్టోబర్‌ 15న థియేటర్స్‌ను ఓపెన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. 'నిరీక్షణ ముగిసింది.. 2021 సంక్రాంతికి మీ దగ్గరలోని థియేటర్స్‌లో అరణ్య ' అంటూ రిలీజ్‌ టీజర్‌ను షేర్‌ చేశారు రానా. ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణువిశాల్‌ కీలక పాత్రను పోషించారు. అస్సాంలోని నిజ ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. జాద‌వ్ ప్రియాంక్ అనే వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది. 

Updated Date - 2020-10-21T18:51:14+05:30 IST