‘రాములో రాముల..’ మరో రికార్డ్

ABN , First Publish Date - 2020-05-13T17:08:51+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’.

‘రాములో రాముల..’ మరో రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ(చిన‌బాబు) నిర్మించారు. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా విడుద‌ల త‌ర్వాత వీడియో సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. బుట్ట‌బొమ్మ వీడియో సాంగ్ రీసెంట్‌గా 150 మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకోగా.. ఇప్పుడు రాములో రాముల వీడియో సాంగ్ 100 మిలియ‌న్ వ్యూస్‌ను క్రాస్ చేసి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. Updated Date - 2020-05-13T17:08:51+05:30 IST