`రాములో రాముల‌..` అరుదైన రికార్డ్‌

ABN , First Publish Date - 2020-02-16T18:34:45+05:30 IST

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ - థమన్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో గీతాలు... ఎంతటి అలజడి సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

`రాములో రాముల‌..` అరుదైన రికార్డ్‌

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ - థమన్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో గీతాలు... ఎంతటి అలజడి సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా.. 'సామజవరగమన', 'రాములో రాములా' పాటలైతే సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. యూ ట్యూబ్ వరల్డ్ లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇంకా చెప్పాలంటే... మెలోడియస్ గా సాగిన 'సామజవరగమన' కంటే పార్టీ సాంగ్ గా తెరకెక్కిన 'రాములో రాములా' కుర్రకారుని ఓ స్థాయిలో ఉర్రూతలూగించింది. అంతేకాదు... అనతి కాలంలోనే యూ ట్యూబ్ ముంగిట 200 మిలియన్ వ్యూస్ పొందింది. సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భారీ విజయాన్ని సాధించింది. 

Updated Date - 2020-02-16T18:34:45+05:30 IST