తొలి హీరో రామ్ కావడం గ్రేట్

ABN , First Publish Date - 2020-06-08T00:39:57+05:30 IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి బాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం అక్కడ....

తొలి హీరో రామ్ కావడం గ్రేట్

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి బాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం అక్కడ డబ్ అయ్యి యూ ట్యూబ్‌లో విపరీతంగా ఆదరణ పొందుతుంటాయి. దానికి తగ్గట్టుగానే రామ్ పోతినేని సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ పోతినేనికి 1.7 మిలియన్ ఫాలోయర్స్ ఉండగా, ట్విట్టర్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... రామ్ పోతినేనికి యూట్యూబ్‌కు సంబంధించి ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.రామ్ పోతినేనికి మొదటి నుండీ యూ ట్యూబ్ మీద మంచి పట్టుంది. దానికి తగ్గట్టుగానే అతని సినిమాల పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్ లభిస్తుంటాయి. రామ్ నటించిన 'నేను శైలజ' మూవీలోని 'ఏం చెప్పను' పాటకు 121 మిలియన్ వ్యూస్ దక్కగా, అదే సినిమాలోని 'క్రేజీ ఫీలింగ్' పాటకు 111 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇదిలా ఉంటే... రామ్ యూట్యూబ్ ఛానెల్ మిలియన్ సబ్ స్ర్కైబర్స్ మైలురాయిని చేరింది. సౌతిండియాలో ఈ మార్క్ అందుకున్న తొలి హీరో రామ్ కావడం గ్రేట్!

Updated Date - 2020-06-08T00:39:57+05:30 IST