గతం గుర్తు చేసుకున్న రామ్‌చరణ్!

ABN , First Publish Date - 2020-06-12T19:09:25+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

గతం గుర్తు చేసుకున్న రామ్‌చరణ్!

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. పాత ఫొటోలను షేర్ చేస్తూ గతాన్ని నెమరు వేసుకుంటున్నారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన ఓ పాత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఆ ఫొటోకు చెర్రీ యాడ్ చేసిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. `ఈ ఫొటో హరిద్వార్‌లో తీసుకున్నది. ప్రస్తుతం పరిస్థితులకు తగినట్టు మసలుకోవడం, మళ్లీ సాధారణ స్థితి వచ్చే వరకు ఎదురుచూడడం ఉత్తమం. సురక్షితంగా ఉండండి` అని రామ్‌చరణ్ కామెంట్ చేశాడు. ఈ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2020-06-12T19:09:25+05:30 IST