`మగధీర`.. చెర్రీ స్పెషల్ వీడియో!

ABN , First Publish Date - 2020-07-31T22:32:02+05:30 IST

తన రెండో సినిమా `మగధీర`తోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్

`మగధీర`.. చెర్రీ స్పెషల్ వీడియో!

తన రెండో సినిమా `మగధీర`తోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌చరణ్ తన ట్విటర్ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశాడు. 


`నాకు మార్గదర్శకంగా నిలిచిన అద్భుతమైన అనుభవం అది. నాలోని ప్రతిభకు గొప్ప పరీక్షగా నిలిచింది. `మగధీర` చిత్రబృందం, అభిమానులు, ప్రేక్షకులు నా మీద చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. రాజమౌళిగారూ.. నాలోని స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించారు. కష్టపడితే ఫలితం ఉంటుందని నాకు తెలిపార`ని చెర్రీ ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-07-31T22:32:02+05:30 IST