గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు..: రామ్‌చరణ్

ABN , First Publish Date - 2020-09-28T17:55:27+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా `చిరుత` సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్ ఆ తర్వాత మెగాపవర్‌స్టార్‌గా ఎదిగాడు

గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు..: రామ్‌చరణ్

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా `చిరుత` సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్ ఆ తర్వాత మెగాపవర్‌స్టార్‌గా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. `చిరుత` విడుదలై నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాను చెర్రీ గుర్తు చేసుకున్నాడు. 


`అప్పుడే 13 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు.. అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్ని వేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాన`ని చెర్రీ ట్వీట్ చేశాడు. అలాగే `చిరుత` చిత్ర దర్శకుడు, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాథ్‌కు విషెస్ తెలియజేశాడు. అలాగే `చిరుత` యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు. 


Updated Date - 2020-09-28T17:55:27+05:30 IST