మేనకోడలితో చెర్రీ డ్యాన్స్!

ABN , First Publish Date - 2020-08-04T16:52:21+05:30 IST

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు.

మేనకోడలితో చెర్రీ డ్యాన్స్!

ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా లభించిన విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంట్లో చేసిన సరదా పనులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. 


తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. తన సోదరి శ్రీజ కూతురు నవిష్కతో కలిసి డ్యాన్స్ చేశాడు. టీవీ ముందు నిల్చుని చెర్రీ, నవిష్క డ్యాన్స్ చేశారు. ఆ వీడియో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2020-08-04T16:52:21+05:30 IST