తెలుగులో రామానంద‌సాగ‌ర్ ‘రామాయ‌ణం’

ABN , First Publish Date - 2020-06-12T19:26:05+05:30 IST

33 ఏళ్ల క్రితం రామానంద సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సీరియ‌ల్ ‘రామాయ‌ణం’.

తెలుగులో రామానంద‌సాగ‌ర్ ‘రామాయ‌ణం’

33 ఏళ్ల క్రితం రామానంద సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సీరియ‌ల్ ‘రామాయ‌ణం’. దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన ఈ సీరియ‌ల్ అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ సీరియ‌ల్‌ను మ‌ళ్లీ రీ టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది వీక్షించిన సీరియ‌ల్‌గా రామాయ‌ణం రికార్డ్‌ను క్రియేట్ చేయ‌డం విశేషం. ఇప్పుడు ఈ రామాయ‌ణంను స్టార్ మా ఛానెల్‌వారు తెలుగులో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. జూన్ 15 నుండి తెలుగు రామాయ‌ణం ప్ర‌సారం కానుంది. ఈ సీరియ‌ల్‌లో అరుణ్ గోవిల్ శ్రీరాముడిగా న‌టిస్తే, సీత పాత్ర‌లో దీపికా చికాలియ‌, ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో సునీల్ ల‌హ‌రి, రావ‌ణుడిగా అర‌వింద్ త్రివేది, హ‌నుమంతుడి పాత్ర‌లో ధారా సింగ్ న‌టించారు. 

Updated Date - 2020-06-12T19:26:05+05:30 IST