ఈ సారి దీపావ‌ళి ముందే వ‌చ్చింది: టీవీ సీతామాత‌!‌‌!‌

ABN , First Publish Date - 2020-08-05T13:43:38+05:30 IST

ఈరోజు అయోధ్య‌లో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజా కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దీనిపై రామాయణం సీరియల్‌లో సీతగా న‌టించిన...

ఈ సారి దీపావ‌ళి ముందే వ‌చ్చింది: టీవీ సీతామాత‌!‌‌!‌

ఈరోజు అయోధ్య‌లో రామాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజా కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దీనిపై రామాయణం సీరియల్‌లో సీతగా న‌టించిన దీపిక చిఖలియా సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈసారి దీపావళి ముందుగానే వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని కామెంట్ రాశారు. రామ‌ జన్మభూమికి పునాదిరాయి ప‌డుతోంది. సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. రామ్‌లాలా ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇది చాలా గొప్ప అనుభూతి కానుంది. ఈ ఏడాది ముందుగానే దీపావళి వ‌చ్చింద‌నిపిస్తోంది. ఇవ‌న్నీ న‌న్నెంతో భావేద్వేగానికి గురిచేస్తున్నాయని దీపిక పేర్కొన్నారు. దీనికిముందు రామాయ‌ణం సీరియ‌ల్‌లో రాముని పాత్ర‌లో న‌టించిన అరుణ్ గోవిల్ కూడా అయోధ్య‌లో భూమి పూజ జ‌రుగుతుండ‌టంపై ఆనందం వ్య‌క్తం చేశారు. 

Updated Date - 2020-08-05T13:43:38+05:30 IST