`రామరాజు ఫర్ భీమ్`.. మరో అరుదైన రికార్డు!

ABN , First Publish Date - 2020-12-18T21:35:29+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`.

`రామరాజు ఫర్ భీమ్`.. మరో అరుదైన రికార్డు!

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్‌లు యూట్యూబ్‌లో అపూర్వ ఆదరణను దక్కించుకున్నాయి. 


దసరా సందర్భంగా విడుదలైన `రామరాజు ఫర్ భీమ్` వీడియో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ వీడియో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటికి 5 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు దక్కించుకున్న టీజర్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు లేదు. అలాగే ఈ వీడియో ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 12 లక్షల లైకులను తన ఖాతాలో వేసుకుంది. ఇక, రామ్‌చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా మార్చిలో విడుదలైన `భీమ్ ఫర్ రామరాజు` వీడియో కూడా యూట్యూబ్‌లో దుమ్మురేపింది. Updated Date - 2020-12-18T21:35:29+05:30 IST