రామాయణం లవకుశులు ఇప్పుడిలా...
ABN , First Publish Date - 2020-04-16T15:50:52+05:30 IST
రామాయణం లవకుశులు ఇప్పుడిలా...

రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం దూరదర్శన్‌లో తిరిగి ప్రసారం అవుతోంది. ఈ చారిత్రక సీరియల్ మరోసారి టిఆర్‌పిలో జెండాను ఎగురవేసింది. రామాయణ గాథ, దానిలోని పాత్రలు దేశమంతటా చర్చనీయాంశమవుతున్నాయి. రామాయణంలోని మిగతా పాత్రల మాదిరిగానే, ఈ షోలో లవకుశుల పాత్రలను పోషించిన బాలనటులకు ఎంతో పేరువచ్చింది. ఈ పాత్రలను ఇద్దరు మరాఠా బాలలు పోషించారు. ఇప్పుడు వీరిలో ఒకరు నటుడు, మరొకరు ఒక సంస్థకు సీఈఓగా ఉన్నారు. రామాయణంలో లవుడు, కుశుడు పాత్రలను స్వాప్నిల్ జోషి, మయూరేష్ పోషించారు. ఒకరు ప్రస్తుతం మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటునిగా వెలుగొందుతున్నారు. మరొకరు న్యూజెర్సీలో పెద్దపోస్టులో ఉన్నారు.