సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

భీమవరం టాకీస్ వారి ఏటీటీ రెడీ.. వారానికి రెండు

ABN, First Publish Date - 2020-07-05T21:04:14+05:30

లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడినప్పుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఏటీటీ.. ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఏటీటీ అంటే ఎనీ టైం థియేటర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడినప్పుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ఏటీటీ.. ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఏటీటీ అంటే ఎనీ టైం థియేటర్ అని ఆర్జీవీ కొత్త విధానానికి నాంది పలికారు. ఆ బాటలోనే భీమవరం టాకీస్ ఏటీటీని రెడీ చేస్తుంది. మొట్టమొదటగా ఇందులో థియేటర్స్ దొరకక ఇబ్బంది పడుతున్న సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్ వరకు థియేటర్స్ ఓపెన్ కాకపోవచ్చు. ఓపెన్ అయినా.. చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవచ్చు. ఈ ఆలోచనతోనే రాంగోపాల్ వర్మ ద్వారా పుట్టిన ఈ ఐడియాను అమలు పరుస్తున్నట్లు నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.


యువతను ఆకట్టుకునే అంశాలతో థియేటర్స్‌లో విడుదల కాకుండా ఓన్లీ ఈ ఏటీటీ ద్వారా విడుదల అవుతున్న మొట్టమొదటి సినిమాగా నిలిచిపోయే చిత్రం ‘అమ్మడు కుమ్ముడు’. తదుపరి భారీగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్పాట్’ ఆ తర్వాత ‘అగ్లీ, శివ 143, థి గ్రేట్ గ్యాంబ్లర్’. ఇంకా అనేక సినిమాలు విడుదల కానున్నాయి. దాదాపు 90 పైగా అద్భుతమైన సినిమాలు ఈ ఏటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, టికెట్ ధర కేవలం రూ. 59 మాత్రమే అని నిర్మాత రామసత్యనారాయణ అన్నారు. ఒకే టికెట్‌పై కుటుంబం అంతా మీకు నచ్చిన ఆప్షన్‌లో సినిమా చూడవచ్చని తెలుపుతూ.. ప్రతి వారం 2 సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.

Updated Date - 2020-07-05T21:04:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!