పోండి సార్ మీతో కటీఫ్.. : రామజోగయ్య శాస్త్రి

ABN , First Publish Date - 2020-06-28T21:29:18+05:30 IST

‘‘ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో

పోండి సార్ మీతో కటీఫ్.. : రామజోగయ్య శాస్త్రి

‘‘ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు.. పోండి సార్ మీతో కటీఫ్.... మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు.. తెలివిగా ఎదో చెప్పేస్తారు...నేను హర్ట్’’ అంటూ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే రామజోగయ్య శాస్త్రి చెప్పింది అక్షరాలా నిజం. రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఎంతోమందికి ఐకాన్. ఇప్పుడు ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. 


ఏం సినిమాలు చేస్తున్నాడో కూడా ఆయనకే తెలియనంతగా ఆయన మారిపోయాడు. రోజుకో సినిమా ప్రకటించే పనిలో ఉన్న వర్మ.. వాటి ద్వారా తన నేమ్ రోజురోజుకీ డౌన్ అవుతుందనే ఆలోచన మాత్రం చేయడం లేదు. తాజాగా ఆయన ‘పవర్ స్టార్’ అంటూ ఓ సినిమా ప్రకటించారు. దీంతో ఆయనపై సర్వత్రా వ్యతిరేకత మొదలవుతుంది. రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్‌కు వస్తున్న కామెంట్స్ చూస్తే.. ఇప్పటి వరకు వర్మని అభిమానించిన వారు కూడా ఎలా మారిపోయారో అర్థమవుతుంది. Updated Date - 2020-06-28T21:29:18+05:30 IST