సంక్రాంతి రేసులో రామ్ 'రెడ్'
ABN , First Publish Date - 2020-10-25T15:56:32+05:30 IST
రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 'రెడ్' చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు రామ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 'రెడ్' చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు రామ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ ప్రభావంతో ఆగింది. మధ్యలో సినిమా ఓటీటీలో విడుదలవుతుందని కూడా వార్తలు వినిపించాయి. కానీ రామ్ తన సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వం థియేటర్స్‌ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి తన 'రెడ్' సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయబోతున్నామంటూ రామ్ అధికారికంగా ప్రకటించారు. 'దేవదాస్, మస్కా' చిత్రాల తర్వాత మరోసారి తన సినిమా సంక్రాంతికి విడుదలవుతున్న నా చిత్రమిదే అంటూ రామ్ తెలిపారు. మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Read more