సంక్రాంతికి రామ్ 'రెడ్' రిలీజ్

ABN , First Publish Date - 2020-12-21T23:52:13+05:30 IST

'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన సినిమా 'రెడ్'.

సంక్రాంతికి రామ్ 'రెడ్' రిలీజ్

'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన సినిమా 'రెడ్'. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇటీవల విడుదలైన 'కౌన్ హే అచ్చా‌... కౌన్ హే లుచ్చా' పాట సహా అంతకుముందు విడుదలైన పాటలకు శ్రోతల నుండి అద్భుత స్పందన లభించింది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'ఇస్మార్ట్ శంకర్'తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, సంక్రాంతి పండక్కి 'రెడ్'తో థియేటర్లలోకి రానున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, 'రెడ్'కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ నెల 24న 'రెడ్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ ప్రకటించారు. ఈ సందర్భంగా...


 హీరో రామ్ మాట్లాడుతూ "సంక్రాంతికి వస్తున్న నా మూడో చిత్రమిది. హీరోగా నా తొలి చిత్రం 'దేవదాసు', తర్వాత 'మస్కా' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.‌ ఇప్పుడు మరోసారి 'రెడ్'తో వస్తున్నాను. సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత కరోనా వచ్చింది. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం" అని అన్నారు.


నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ "రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో... ఈ అంశాలన్నీ సినిమాలో ఉంటాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి పాటకు అద్భుత స్పందన లభించింది. మణిశర్మగారి స్వరాలకు ఎంత గొప్ప ఆదరణ ఉంటుందనేది మరోసారి నిరూపించింది. 'డించక్ డించక్...' పాటలో రామ్ స్టెప్స్  ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఇటలీలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన  పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి‌. ఈ నెల 24న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని అన్నారు.Updated Date - 2020-12-21T23:52:13+05:30 IST