హీరో రామ్ పార్టీలో యంగ్ డైరెక్టర్స్!

ABN , First Publish Date - 2020-12-21T18:25:41+05:30 IST

`ఇస్మార్ట్ శంకర్` సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నాడు.

హీరో రామ్ పార్టీలో యంగ్ డైరెక్టర్స్!

`ఇస్మార్ట్ శంకర్` సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన `రెడ్` చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


రామ్ తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్‌ కోసం విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, కిషోర్ తిరుమల, సంతోష్ శ్రీనివాస్ వెంకీ కుడుముల పాల్గొన్నారు. `రెడ్` విడుదల తర్వాత రామ్ తన తర్వాతి సినిమా గురించి ప్రకటన చేయబోతున్నాడు. 

Updated Date - 2020-12-21T18:25:41+05:30 IST