త‌మిళంపై ఆస‌క్తిగా ఉన్న రామ్‌

ABN , First Publish Date - 2020-05-11T14:56:18+05:30 IST

తెలుగు స‌హా మ‌రో భాష‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తిగా ఉన్నారు. అలా తెలుగు నుండి మ‌రో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తిగా ఉన్న హీరోల్లో రామ్ ఒక‌రు.

త‌మిళంపై ఆస‌క్తిగా ఉన్న రామ్‌

ఇప్పుడు తెలుగు స్టార్స్ అంద‌రూ త‌మ సినిమాల మార్కెట్‌ను క్ర‌మంగా పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టాప్ రేంజ్‌లోని హీరోలంద‌రూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మ‌రికొంద‌రు తెలుగు స‌హా మ‌రో భాష‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తిగా ఉన్నారు. అలా తెలుగు నుండి మ‌రో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తిగా ఉన్న హీరోల్లో రామ్ ఒక‌రు. 


రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రామ్ తాను త‌మిళంలో ఎంట్రీ ఇవ్వ‌డానికి మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని తెలిపారు. చెన్నైలో పుట్టి పెర‌గ‌డంతో త‌మిళంపై మంచి ప‌ట్టు ఉంది.. అలాగే త‌మిళ సినిమాపై ఉన్న గౌర‌వంతో త‌మిళంలో సినిమా చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు రామ్ తెలిపారు. ఎన‌ర్జిటిక్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ ఇప్పుడు ‘రెడ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాడు. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ త‌ర్వాత రామ్ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. ఏప్రిల్ 9న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. 

Updated Date - 2020-05-11T14:56:18+05:30 IST