వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్: ‘పారాసెటమాల్’, ‘బ్లీచింగ్ పౌడర్’

ABN , First Publish Date - 2020-05-27T02:58:46+05:30 IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కరెంట్ ఇష్యూపై సినిమా స్టార్ట్ చేశారు. సినిమా పేరు తెలిస్తే.. ఆ కరెంట్ ఇష్యూ ఏమిటో కూడా తెలిసిపోతుంది. ఎప్పుడు ఏ విషయం

వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్: ‘పారాసెటమాల్’, ‘బ్లీచింగ్ పౌడర్’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కరెంట్ ఇష్యూపై సినిమా స్టార్ట్ చేశారు. సినిమా పేరు తెలిస్తే.. ఆ కరెంట్ ఇష్యూ ఏమిటో కూడా తెలిసిపోతుంది. ఎప్పుడు ఏ విషయం హైలెట్ అయితే ఆ విషయంపై సినిమాను ప్రకటించడంలో రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు. ఇక అదోక కాంట్రవర్శీ సబ్జెక్ట్ అయితే మాత్రం వర్మ చెలరేగిపోతాడు. రూపాయి ఖర్చు లేకుండా సినిమాకి ప్రమోషన్ అయిపోతుందని.. కావాలని అలాంటి కథలతో వర్మ సినిమాలు తీస్తాడనేది జగమెరిగిన సత్యం. తాజాగా ఆయన ‘కరోనా వైరస్’ అంటూ ఓ సినిమాను తీస్తున్నారు. ప్రస్తుత లాక్‌డౌన్‌లో కూడా షూటింగ్ చేస్తుండటం ఆయనకే సాధ్యం. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను వివరిస్తూ వర్మ కొన్ని ఫొటోలను అలాగే ట్రైలర్‌ను విడుదల చేశారు.


ఈ ట్రైలర్‌లో ఒక కుటుంబం ‘కరోనా వైరస్’ విషయంలో ఎటువంటి నిర్ణయంతో ఉంది, ప్రభుత్వాలు కరోనా విషయంలో ఏం చెబుతున్నాయనేది వివరిస్తూ వర్మ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ ఎండింగ్‌లో కేసీఆర్ చెప్పిన ‘పారాసెటమాల్’ డైలాగ్, అలాగే వైఎస్ జగన్ చెప్పిన ‘బ్లీచింగ్ పౌడర్’ డైలాగ్ చాలు.. కాంట్రవర్శీ అవ్వడానికి. ట్రైలర్ చివరి వరకు ఆసక్తికరంగా చూసిన ప్రేక్షకులకి చివరలో వచ్చే ఈ రెండు డైలాగ్స్ ఫుల్ కిక్ ఇస్తాయనడంలో సందేహం లేదు. వర్మకు కావాల్సిందే అది. మొత్తానికి కరోనా సమయంలో కూడా కరోనాపైనే సినిమా తీసి తనకున్న కరెంట్ ఇష్యూ కిక్‌ని మరోసారి నిరూపించుకున్నాడు వర్మ.

Updated Date - 2020-05-27T02:58:46+05:30 IST