చిరు152 ఫ‌స్ట్‌లుక్‌, మోషన్ పోస్ట‌ర్ రిలీజ్‌పై చరణ్ ట్వీట్

ABN , First Publish Date - 2020-08-19T00:28:57+05:30 IST

రానున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి ట్రీట్ రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో

చిరు152 ఫ‌స్ట్‌లుక్‌, మోషన్ పోస్ట‌ర్ రిలీజ్‌పై చరణ్ ట్వీట్

రానున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి ట్రీట్ రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చిరు, ఆగ‌స్ట్ 22న త‌న 65వ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులకు చిరంజీవి పుట్టిన‌రోజు గిప్ట్‌ను అందిస్తున్నారు. ఆగ‌స్ట్ 22 సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఇదే విషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 


‘‘చిరు150 ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌తో మేము సిద్ధంగా ఉన్నాం. ఆగస్ట్ 22 సాయంత్రం 4 గంటలకు కలుసుకుందాం..’’ అని రామ్ చరణ్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేవంటే నమ్మాలి మరి. సోషల్ మీడియా అంతా ఇప్పుడు చిరు 152 మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్. తిరు, సంగీతం: మణి శర్మ, ఆర్ట్: సురేష్ సెల్వరాజన్, ఎడిటింగ్: నవీన్ నూలి.



Updated Date - 2020-08-19T00:28:57+05:30 IST