మేన‌కోడ‌ళ్ల వీడియో పోస్ట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌

ABN , First Publish Date - 2020-06-16T14:23:26+05:30 IST

కోవిడ్ 19 ప్ర‌భావం పెరుగుతున్న స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. ఈ క‌మ్రంలో మ‌నం వాడుతున్న కూర‌గాయ‌ల‌ను శుభ్ర‌ప‌రిచి ఉప‌యోగించాల‌ని చెబుతున్నారు హీరో రామ్‌చ‌ర‌ణ్‌.

మేన‌కోడ‌ళ్ల వీడియో పోస్ట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌

కోవిడ్ 19 ప్ర‌భావం పెరుగుతున్న స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. ఈ క‌మ్రంలో మ‌నం వాడుతున్న కూర‌గాయ‌ల‌ను శుభ్ర‌ప‌రిచి ఉప‌యోగించాల‌ని చెబుతున్నారు హీరో రామ్‌చ‌ర‌ణ్‌. అందులో భాగంగా రామ్‌చ‌ర‌ణ్ త‌న మేన‌కోడ‌ళ్లకు సంబంధించిన వీడియో ఒక‌టి పోస్ట్ చేశారు. అందులో చెర్రీ మేన‌కోడ‌ళ్లు కూర‌గాయ‌ల‌ను శుభ్రం చేసి ఆర‌బోశారు. ఎందుక‌లా చేశార‌ని వారిని చ‌ర‌ణ్ అడ‌గ్గా క్రిములు పోయేలా ముందు కూర‌గాయ‌ల‌ను స‌బ్బు నీటితో క‌డిగి త‌ర్వాత సాధార‌ణ నీళ్ల‌తో క‌డిగామ‌ని వారు బ‌దులిచ్చారు. త‌న మేన‌కోడ‌ళ్లు కూర‌గాయ‌ల‌ను చ‌క్క‌గా శుభ్రం చేశార‌ని, ఎంతో బాధ్య‌త ఉన్న పిల్ల‌ల‌ని రామ్‌చ‌ర‌ణ్ వీడియోలో పిల్ల‌ల‌ను అప్రిషియేట్ చేశారు. 

Updated Date - 2020-06-16T14:23:26+05:30 IST