కోలుకున్న రకుల్‌!

ABN , First Publish Date - 2020-12-29T17:47:31+05:30 IST

కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కోలుకుంది.

కోలుకున్న రకుల్‌!

కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కోలుకుంది. తాజాగా చేయించుకున్న పరీక్షలో ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రకుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. 


`తాజాగా చేయించుకున్న పరీక్షలో నాకు కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నా. మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరాన్ని మంచి ఆరోగ్యంతోనూ, ఆశావహ దృక్పథంతోనూ ప్రారంభిస్తా. అందరూ బాధ్యతగా ఉండండి. మాస్కులు ధరించడంతోపాటు అన్ని జాగ్రత్తలూ తీసుకోండ`ని రకుల్ పేర్కొంది. Updated Date - 2020-12-29T17:47:31+05:30 IST