రకుల్ ర్యాప్ సాంగ్!

ABN , First Publish Date - 2020-10-28T17:02:39+05:30 IST

ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తనలోని కొత్త ట్యాలెంట్‌ను తాజాగా బయటపెట్టింది.

రకుల్ ర్యాప్ సాంగ్!

ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తనలోని కొత్త ట్యాలెంట్‌ను తాజాగా బయటపెట్టింది. తాజాగా `కరే ని కర్దా రాప్` ఛాలెంజ్‌లో పాల్గొని అద్భుతంగా ర్యాప్ సాంగ్ పాడింది. ఆ పాటకు రకుల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు, పాడిన విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నుంచి రకుల్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించింది. 


``కరే ని కర్దా రాప్`కు నన్ను నామినేట్ చేసినందుకు, వీడియోను రూపొందించడానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు అర్జున్ కపూర్. నాకు మీలా చాలా సహాయం చేశారు. అందువల్లే మీలా సగం సగం కాకుండా పూర్తిగా ర్యాప్‌ను పాడగలిగాన`ని రకుల్ పేర్కొంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అనంతరం ఈ ఛాలెంజ్‌కు నటుడు, టీవీ హోస్ట్ అపరశక్తి ఖురానాని నామినేట్ చేసింది.Updated Date - 2020-10-28T17:02:39+05:30 IST