రకుల్ పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్న!

ABN , First Publish Date - 2020-09-29T21:32:27+05:30 IST

కోర్టు చెప్పినా వినకుండా, తనకు వ్యతిరేకంగా మీడియా కథనాలు ప్రచారం చేయడాన్ని ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్న!

కోర్టు చెప్పినా వినకుండా, తనకు వ్యతిరేకంగా మీడియా కథనాలు ప్రచారం చేయడాన్ని ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హై కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తను సిగరెట్ కాల్చనని, ఆల్కహాల్ తీసుకోనని, డ్రగ్స్ కేసులో తనను సాక్షిగా మాత్రమే పిలిచారని, అయినా మీడియాలో తనపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై హై కోర్టు స్పందించింది. 


ఈ నేపథ్యంలో రకుల్ పేరును డ్రగ్స్ కేసుకు ముడిపెడుతూ మీడియాలో కథనాలు రాకుండా నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబర్ 3లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను కోర్టు ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా అక్టోబర్ 15న ఈ కేసును విచారణకు స్వీకరించనుంది. 

Updated Date - 2020-09-29T21:32:27+05:30 IST